Good Tips : టూత్ పేస్ట్ తో పళ్లు మాత్రమే కాదు.. వీటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు..!

టూ త్ పేస్ట్ను కేవలం పళ్లను శుభ్రం చేసుకోడానికి మాత్రమే వాడుతున్నారా? అయితే చాలా లాభాలు మిస్సవుతున్నట్టే... పేస్టును చాలా రకాలుగా ఉపయోగించొచ్చు. రంగు రంగుల పేస్టుల కంటే తెల్లని పేస్టు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. తెల్ల టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ తక్కువగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు, కళ్ల కింద సర్కిళ్లను పోగొట్టడానికి టూత్ పేస్ట్ ఉపయోగపడుతుంది.

 చిన్న చిన్న స్కిన్ ఎలర్జీలు ఏమైనా ఉంటే.. వాటిని కూడా టూత్ పేస్ట్లో తగ్గించుకోవచ్చు. మంట, దురద, ఎలర్జీలకు ఇది మంచి రెమిడీ. ఇంకా ఇంట్లో టూత్ పేస్టుతో చాలా చేయొచ్చు.  వెండి, ఇత్తడి వస్తువులు కొత్తగా మెరవాలంటే.. ముందుగా వాటికి పేస్ట్ రాసి రాత్రంతా వదిలేయాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేస్తే అవి తళతళా మెరుస్తాయి. సీడీలు, డీవీడీలపై స్క్రాచ్ ను తొలగించాలంటే.. కాస్త టూత్ పేస్ట్ రాసి శుభ్రమైన క్లాత్తో తుడిస్తే చాలు.  

పేస్ట్ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను కూడా శుభ్రం చేయొచ్చు. కొంచెం పేస్ట్ స్క్రీన్ కు రాసి, మెత్తటి గుడ్డతో తుడిస్తే చాలు స్క్రీన్ మిలమిల్లాడుతుంది. బట్టల మొండి మరకలు ఉంటే అక్కడ కాస్త పేస్ట్ రాసి ఉతకండి. ఇలా చేస్తే మరకలు మాయం అవుతాయి.   తెల్లని షూలుపై నల్లని మచ్చలు కనిపిస్తే కాస్త పేస్ట్ పెట్టి గుడ్డతో శుభ్రం చేస్తే సరి.. తళతళా మెరుస్తాయి.  చేపలు, రొయ్యలు, మాంసాన్ని ముట్టుకున్నప్పుడు చేతులు వాసన వస్తాయి. 

అప్పుడు చేతికి కాస్త పేస్ట్ రాసుకుంటే వాసనే ఉండదు. కాలిన గాయాలకు పేస్ట్ రాస్తే కాస్త ఉపశమనం ఉంటుంది.  బాత్రూమ్లోని సింకులకు కాస్త పేస్ట్ రాసి కడిగితే మురికి వదిలి శుభ్రంగా కనిపిస్తాయి.  ఏదైనా పురుగు కుట్టినా, గాయాలు అయినా అక్కడ పేస్టు రాస్తే కాస్త చల్లగా ఉండి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.