భలే ఐడియా : అరటి తొక్క.. గుడ్డు పెంకులే కదా అని పారేయొద్దు.. వాటితో ఇలా చేయొచ్చు తెలుసా..!

 అరటిపండు తొక్క.. పాడైపోయిన బ్రెడ్ ముక్క లాంటి వాటిని దేనికీ పనికిరావని పారేస్తుంటాం. అయితే, కొంచెం క్రియేటివ్ గా ఆలోచిస్తే.. వాటిని కూడా ఏదో ఒక దానికి ఉపయోగపడే విధంగా మార్చుకోవచ్చు. అది ఎట్లనో చూద్దాం!

ఇంట్లో తినకుండా మిగిలిపోయిన ఇంటిడ్ ఉంటే దాన్ని పారేయాల్సిన పని లేదు. వాటిని బ్రెడ్ బ్రౌటన్లుగా మార్చుకోవచ్చు. కాకపోతే అవి బూజు పట్టకుండా ఉండాలి. మిగిలిపోయిన బ్రెడ్ టుగా తయారు చెయ్యాలంటే.. ముందుగా బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. తర్వాత వాటిపై అలివ్ ఆయిల్ని చల్లి... ఒవెన్లో . గోధుమ రంగు వచ్చే వరకు బేక్ చెయ్యాలి! పాడైపోయిన బ్రెడ్తో ఇలా సాయంత్రం స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. 

అరటి తొక్కలతో...

 అరటి తొక్క అంటే అందరికీ చులకనే. తిని పారేస్తుంటారు. కానీ, దానితోనూ ఉపయోగాలున్నాయి. అరటితొక్కతో లెదర్ బూట్లను పాలిష్ చేసుకోవచ్చు. షూ పాలిష్ అందుబాటులో లేనప్పుడు మీ ఇంట్లో అరటి పండ్లు ఉండే చాలు, మీ సమస్య తీరిపోయినట్లే. అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మార్కెట్లో దొరికే షూ పాలిషుల్లో ఉండేది కూడా పొటాషియమే! అరటి తొక్క లోపలి భాగాన్ని ఉపయోగించి, షూ పాలిష్ చేసి, ఒక పొడి బట్టతో తుడిస్తే షూ మెరవడం. ఖాయం!

కోడి గుడ్డు పెంకులతో

కోడి గుడ్డులో ఎన్ని పోషకాలు ఉంటాయో పెంకుల్లో కూడా కొన్ని పోషకాలు ఉంటాయి. అవి మొక్కలకు సహజసిద్ధమైన ఎరువులుగా ఉపయోగపడతాయి. అందుకే గుడ్డు పెంకులను చెత్తబుట్ట పాలు చెయ్యకుండా. మీ పెరట్లో ఎరువుగా వాడుకోండి. ఇది మీ మొక్కలకు పట్టే చీడలను తొలగించడంలో కూడా సాయ పడ్తుంది. 

ఎక్స్ఫర్డ్ బేకింగ్ సోడాతో 

అల్మారాలో గడువు ముగిసిన బేకింగ్ సోడా ఉంటే... దాన్ని వృథాగా పారేయాల్సిన అవసరం లేదు. ఇది వంట గదిలోని కఠినమైన మరకలను వదిలించుకోవడానికి క్లీనింగ్ ఏజెంట్ లాగ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కుండలు, పాత్రలు మీద ఏర్పడే మొండి మరకలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. 

సుగంధ ద్రవ్యాలతో.. 

ఇంట్లో ఎక్స్ పైర్ అయిన సుగంధ ద్రవ్యాలు అంటే మెంతులు, యాలకులు, లవంగం, దాల్చనచెక్క, ధనియాలు లాంటి వాటితో కొవ్వొత్తుల పరిమళానికి వినియోగించవచ్చు. ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ కొవ్వొత్తులమైనాన్ని, కరిగించి మీకు నచ్చిన సుగంధ ద్రవ్యాలలో కలిపి కొవ్వొత్తులుగా తయారు చేయడమే. అలా చేస్తే కొవ్వొత్తి వెలిగించడం ద్వారా ఇంట్లో పరిమళాలు వెదజల్లేలా చేసుకోవచ్చు.