Plant business: హాబీని బిజినెస్ గా మార్చుకున్న మహిళ.. ఏడాదిలో కోటి సంపాదించింది.

హాబీ అనేది బిజినెస్ గా మారితే ఎలా ఉంటుంది.. డబ్బుకు డబ్బు.. సంతృప్తి రెండూ దొరుకుతాయని ఓ మహిళ ప్రూవ్ చేసింది. మొక్కలంటే ఎంతో ప్రాణం ఆమెకు.. మొక్కలను పెంచడం అంటే మహాపిచ్చి.. ఇంట్లో మొత్తం ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తాయి. ఇంటిని అలంకరించే మార్గంగా ప్రారంభించిన అభిరుచి.. బిజినెస్ వైపు అడుగులు వేయించింది. ఇంట్లోనే మొక్కలు పెంచి అమ్మడం ద్వారా కోట్లు సంపాదించింది. ఈ మొక్కల బిజినెస్ ఎవరు.. ఎక్కడ, ఎలా చేశారు ఎంత సంపాదించారో వివరాల్లో తెలుసుకుందాం.. 
 
లీనా పెట్టి గ్రూ..44 ఏళ్ల US కు చెందినIT ప్రొఫెషనల్. మొక్కలంటే ప్రాణం.. ఇంట్లోనే రకరకాల మొక్కలను పెంచుతుంది. అది ఆమె హాబీ. అంతటితో ఆగలేదు.. హాబీ బిజినెస్ గా మార్చుకుంది. కేవలం ఒక సంవత్సరంలో ఆమె ఇంట్లో పెరిగే మొక్కలను అమ్మడం ద్వారా దాదాపు $148,600 (సుమారు రూ. 1.25 కోట్లు) సంపాదించింది. 

లీనా 2017లో తొలిసారి ఈమొక్కల బిజినెస్ ప్రారంభించింది.  అయితే అది విఫలమైంది. గోల్డెన్ పోథోస్ మొక్కలతో బిజినెస్ మొదలుపెట్టగా.. ఆ మొక్కలను ఆమె సంరక్షించలేకపోయింది. అయితే 2022లో హ్యూస్టన్ లో సొంతింటిని పునర్నిర్మిస్తున్న సమయంలో లీనా, ఆమె భర్త మార్క్సిస్ట్ మళ్లీ మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నారు. కాలం గడిచిన కొద్దీ.. మొక్కలపై వారి ఆసక్తి వారి బిజినెస్ ను రెట్టింపు చేసింది. లీనా కపుల్స్  8 అడుగుల పొడవైన మాన్ స్టెరాస్ మొక్కతో సహా అనేక రకాల మొక్కలను ఇళ్లు మొత్తం నింపి పెంచారు. 

ALSO READ | Today Gold Rate: బంగారం వెంటనే కొనుక్కోండి.. ఇప్పట్లో మళ్లీ ఇంత తగ్గకపోవచ్చు..!

పెరుగుతున్న మొక్కలను లీనా పెట్టిగ్రూ వాటిని ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ పామ్‌స్ట్రీట్‌లో అమ్మాలని నిర్ణయించుకుంది. జూన్ 2023లో ఆమె లైవ్ స్ట్రీమ్ వేలంపాటలను నిర్వహించడం ప్రారంభించింది. అక్కడ ఆమె మొక్కలను ఇష్టపడే ప్రేక్షకులకు తన మొక్కలను చూపుతుంది. జూలై 2024 నాటికి, పెట్టిగ్రూ తన సైడ్ బిజినెస్ నుండి నెలకు సగటున 12,380 డాలర్లు అంటే  దాదాపు రూ. 10.45 లక్షలు సంపాదిస్తోంది.

పెట్టిగ్రూ ITలో పూర్తి సమయం పనిచేసినప్పటికీ  90,000 డాలర్లు మాత్రమే సంపాదించేది.. ఆమె తన ప్లాంట్ వ్యాపారంలో వారానికి 20 గంటలు గడుపుతుంది. ఆమె మొక్కలను కొనడం నుండి విక్రయించడం , రవాణా చేయడం వరకు ప్రతిదీ నిర్వహిస్తుంది. ఆమె తమ గ్యారేజీగా మారిన గ్రీన్‌హౌస్ నుండి ఇదంతా చేస్తుంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఐదుగురు కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించింది. ఆమె ఇంటికి మొక్కలను జోడించే మార్గంగా ప్రారంభించింది.  ఇప్పుడు ఒకేసారి 1,000 మొక్కల వరకు నిల్వ చేయబడి పూర్తి వ్యాపారంగా మారింది. ప్లాంట్ వ్యాపారం తగినంత లాభదాయకంగా మారింది. 

ఆమె మొక్కల ధరలు 30 డాలర్లు అంటే  దాదాపు రూ. 2,500ల నుంచి 115 డాలర్లు అంటే సుమారు రూ. 9,700 వరకు ఉంటాయి. బిజినెస్ బాగుండటంతో పెటిగ్రూ తన పూర్తి-సమయ మొక్కల  వ్యాపారానికి కేటాయించాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె ఆటో దుకాణాన్ని అమ్మేసీ ఫ్లోరిడాకు వెళ్లాలని భావిస్తోంది. తన స్వంత గ్రీన్‌హౌస్ తెరవాలని కలలు కంటుంది. తగినంత మంది సిబ్బందితో ఆమె , తన భర్త మార్క్వైస్ పార్ట్ టైమ్ పని చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది.