ప్రపంచం అంతా అమెరికాలో ఏం జరుగుతుందో చూస్తుంటే.. అమెరికన్లు మాత్రం అదే చూశారు..!

ప్రపంచాన్ని శాశించే అగ్రదేశ అధిపతి ఎవరు..? అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో కాలు పెట్టబోయేది ఎవరు? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపా .. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్సా.. నవంబర్ 5న అమెరికా ప్రజలకు నరాలు తెగే  ఉత్కంఠ. అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లో ఇదే తరహా టెన్షన్ ఉంది. ఎన్నికల వేళ అమెరికన్లు సస్పెన్స్ తట్టుకోలేక పోర్న్ సైట్స్ ఎక్కువ ఓపెన్ చేశారంట. అమెరికాలో నవంబర్ 3 నుంచి 6 వరకు ఇంటర్ నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన వివరాలను న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. అమెరికన్లు ఎలక్షన్ల యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఎక్కువగా  అశ్లీల చిత్రాలు(పోర్న్ వీడియోస్) చూశారంట.

అమెరికా ఎన్నికలు జరిగిన రోజే.. వెంటనే ఫలితాలు రిలీస్ చేస్తారు. అక్కడ నవంబర్ 5న ఎలక్షన్ జరగ్గా.. నవంబర్ 6న రిజల్ట్స్ విడుదల చేశారు. ఎలక్షన్ రోజు అమెరికా రాష్ట్రాల్లో పోర్న్‌హబ్ ట్రాఫిక్‌ 7 శాతం పెరిగింది. రిపబ్లికన్స్, డెమోక్రటిక్స్ అమెరికా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఎక్కువైంది. దీంతో వారి మైండ్ యాంగ్జైటీకి గురైంది. యాంగ్జైటీని తగ్గించుకోవడానికి అడల్ట్ కంటెంట్ చూశారంట. ఎన్నికల రిజల్ట్స్ సమయం ఉదయం 8 మరియు 9 గంటల మధ్య అడల్ట్ కంటెంట్ సైట్ ఎక్కువ వ్వ్యూస్ వచ్చాయని డేటా చెప్తోంది. 

కాలిఫోర్నియా, కొలరాడో, ఫ్లోరిడా,మసాచుసెట్స్ రాష్ట్రాల్లో ప్రజలు వారి టెస్టులకు తగ్గట్టుగా అడల్ట్ కంటెంట్ కోసం ఇంటర్ నెట్ లో సెర్చ్ చేశారు. వెర్మోంట్, హాంప్‌షైర్, మైన్, కనెక్టికట్, వాషింగ్ టన్ DC, న్యూజెర్సీ, డెలావేర్, మేరీల్యాండ్, అలాస్కా, పెన్సిల్వేనియా,నెవాడా, జార్జియా, అరిజోనా, మిచిగాన్, విస్కాన్సిన్, ఒరెగాన్, న్యూ మెక్సికో, నార్త్ డకోటా ప్రాంతాలకు చెందిన అమెరికన్లు డిఫెరెంట్ డిఫరెంట్ అడల్ట్ కంటెంట్ కోసం పోర్న్ సైట్లలో వెతికారంట.

ALSO READ : ఆ రెండు రాష్ట్రాలూ ట్రంప్ ఖాతాలోకే..

అమెరికాలోని 14 రాష్ట్రాల్లో మాత్రం పోర్న్ సైట్లు బ్యాన్ చేశారు. అలబామా, అర్కాన్సాస్, ఇడాహో, ఇండియానా, కాన్సాస్, కెంటుకీ, మిస్సిస్సిప్పి, మోంటానా, నెబ్రాస్కా, నార్త్ కరోలినా, ఓక్లహోమా, టెక్సాస్, ఉటా మరియు వర్జీనియా రాష్ట్రాల్లో పోర్న్ సైట్లు నిషేధించారు. అందుకే ఇక్కడ ఎక్కువ మంది ఆ వీడియోస్ కోసం కోసం వెతకలేదు.