ఇసుక రాయి శిల్పాన్ని తిరిగి ఇస్తాం .. 1400 వస్తువులను అందిస్తామంటున్న అమెరికా

న్యూయార్క్: భారత్ కు10మిలియన్ డాలర్ల విలువైన1400కుపైగా పురాతన వస్తువులను తిరిగి ఇచ్చేస్తామని అమెరికా చెప్పింది. ఈ మేరకు బుధవారం మాన్ హాట్టన్ డిస్ట్రిక్ అటార్నీ ఆల్విన్ ఎల్. బ్రాగ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. క్రిమినల్ ట్రాఫికింగ్ నెట్ వర్క్స్ లపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.10 మిలియన్ డాలర్ల విలువైన 1,440 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. 

ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ ను లక్ష్యంగా చేసుకున్న ట్రాఫికింగ్ నెట్ వర్క్ లపై దర్యాప్తును కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారత్ కు తిరిగివ్వనున్న పురాతన వస్తువులలో మధ్యప్రదేశ్‌‌లోని ఆలయం నుంచి దోచుకున్న ఖగోళ నృత్యకారుడిని వర్ణించే ఇసుకరాయి శిల్పం, రాజస్థాన్ లోని తానేసర మహాదేవ గ్రామం నుంచి దోచుకున్న గ్రీన్–గ్రే రంగులోని తానేసర్ దేవత విగ్రహం ఉన్నాయి.