దొంగలించబడ్డ 14 వందల పురాతన శిల్పాలను భారత్ కు తిరిగిచ్చిన అమెరికా..

భారత్ కు చెందిన 14 వందల దొంగలించబడ్డ పురాతన శిల్పాలను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ సుమారు 10 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. వీటిలో 1980లో మధ్యప్రదేశ్ లోని ఓ గుడిలో నుండి దింగలించిన ఖగోళ నర్తకి ఇసుక రాతి శిల్పం వంటి అరుదైన కళాకృతులు ఉన్నట్లు తెలుస్తోంది. స్మగ్లింగ్ కు అనుకూలంగా ఉండటం కోసం దుండగులు  దుండగులు ఈ శిల్పాన్ని రెండుగా విడగొట్టారని తెలుస్తోంది. ఈ శిల్పాన్ని మళ్ళీ ప్రొఫెషనల్స్ చేత అతికించి..  కపూర్ క్లయింట్‌లలో ఒకరు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కి విరాళంగా ఇచ్చారని సమాచారం.

మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ప్రదర్శనకు ఉన్న ఈ సెలెస్టియల్ డ్యాన్సర్ శిల్పాన్ని 2023లో ఆర్ట్ థెఫ్ట్ యూనిట్  స్వాధీనం చేసుకుంది. దొంగలించబడ్డ పురాతన శిల్పాలను భారత్ కు తిరిగి అప్పగించటం చరిత్రలో ఒక మైలు రాయి అని పేర్కొంది హెచ్ఎస్ఐ న్యూయార్క్. ఇండియాలో ఉన్న తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించామని తెలిపింది హెచ్ఎస్ఐ న్యూయార్క్.