గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని బ్యాన్ చేయాలి..యూఎస్ న్యాయశాఖ సిఫారసు

గూగుల్ క్రోమ్ ను మూసినవేయాలని యూఎస్ న్యాయశాఖ డిమాండ్ చేస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తొలగించాలని జడ్జిని కోరేందుకు యూఎస్ జస్టిస్ డిపార్టుమెంట్ సిద్దమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. దీంతోపాటు డేగా లైసెన్సింగ్ పరిమితులు విధించాలని కోరేందుకు సిద్దంగా ఉంది. ఇదే గనక జరిగితే టెక్నాలజీ రంగంలో దిగ్గజం గూగుల్ పై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సిమిలర్ వెబ్ అక్టోబర్ 2024 డేటా ప్రకారం.. ప్రస్తుతం గూగుల్ క్రోమ్ గ్లోబల్ బ్రౌజర్ మార్కెట్ లో 65 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. యాపిల్ కు చెందిన సఫారీ 21 శాతం తో రెండో స్థానంలో ఉంది.  

ఎందుకు గూగుల్ పై చర్యలు.. 

సెర్చింగ్, అడ్వర్ టైసింగ్ మార్కెట్లపై గూగుల్ గుత్తాపత్యం చలాయిస్తుందని.. యాంటీ ట్రస్ట్ చట్టాను ఉల్లంఘిస్తుందని..ఈ సంస్థపై నియంత్రణ చాలా అవసరం అని ఆగస్టులో అమెరికా కోర్టు చెప్పింది. దీని ప్రకారం గూగుల్ పై చట్టపరమైన చర్యలకు అమెరికా న్యాయశాఖ కోరుతోంది. బుధవారం (నవంబర్ 20) న గూగుల్ పై చర్యలకు ముసాయిదా దాఖలు చేసేందుకు సిద్దమైంది.  

Also Read :- ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్

ట్రంప్ ఎన్నిక  గూగుల్ ప్రభావం చూపుతుందా?

గత సెప్టెంబర్ లో తన గురించి గూగుల్ తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తుందని ట్రంప్ విమర్శించారు. న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. అయితే గత నెలలో ట్రంప్ స్వరం తగ్గించి.. గూగుల్ పై చర్యలకు తాను అనుకూలంగా లేనని సూచించాడు. ఇది మార్పు.. జనవరిలో ట్రంప్ బాధ్యతలు చేపడితే న్యాయశాఖపరంగా గూగుల్ కొంత ఊరట లభించొచ్చని తెలుస్తోంది. 
ఈ కేసులో ఏప్రిల్ 2025 నుంచి విచారణ ప్రారంభం కానుంది.న్యాయమూర్తి తన తుది తీర్పును ఆగస్టు 2025లో వెలువరించే అవకాశం ఉంది. తుది తీర్పును ప్రకటించిన తర్వాత తీర్పుపై అప్పీల్ చేయాలనే దాని ప్రణాళికలను Google  ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించింది.