అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ:32వేలమంది పిల్లలకు కోరింత దగ్గు..10ఏళ్లల్లో హయ్యెస్ట్ కేసులు

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ..ప్రమాదకర స్థాయిలో పిల్లల్లో కోరింత దగ్గు..10యేళ్లలో ఎప్పుడు చూడని కోరింత దగ్గు కేసులు..కేవలం12 వారాల్లో రెట్టింపు అయిన కేసులు.. సెప్టెంబర్లో 14వేలున్న కేసులు..డిసెంబర్ 14 నాటికి 32వేలు పెరిగాయి.

యునైటెడ్ స్టేట్స్ లో కోరింత దగ్గు కేసులు దశాబ్ద గరిష్ట స్థాయికి చేరాయి.  సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోట్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుంచి రిపోర్టు ప్రకారం.. డిసెంబర్ 14 నాటికి యూఎస్ లో 32వేల కంటే ఎక్కువ కోరింత దగ్గు కేసులు నమోదు అయ్యాయి. గత 12 వారాల్లో కేసులు సంఖ్య రెట్టింపు అయ్యింది. సెప్టెంబర్  15 వరకు 14వేల కేసులు నమోదు కాగా డిసెంబర్14 వరకు 32వేల136 కి చేరింది. 

Also Read : ముఖ్యమంత్రిని చేస్తాం.. పార్టీలోకి వచ్చేయ్ అన్నారు

2023 సెప్టెంబర్లో 6వేల514 కేసులు నమోదు అయ్యాయి.2024లో అదే సమయంలో కోరింత దగ్గు కేసులు ఆరు రెట్లు పెరిగాయి. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం, టెస్టులు తక్కువగా ఉండటం, వ్యాక్సిన్లు పనిచేయకపోవడం వంటివి కోరింత దగ్గు కేసులు పెరుగుదలకు కారణం. 

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో CDC కీలక ప్రకటన చేసింది. ప్రతి ఒక్కరు కోరింత దగ్గు టీకా తీసుకోవాలని సిఫారసు చేసింది.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చని తెలిపింది.