అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: పోల్స్‎లో కమలా హ్యారిస్‎కే ఆధిక్యం

వాషింగ్టన్: గత జులైలో జో బైడెన్ తప్పుకోవడంతో అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమల ఎంటర్ కాగా.. అప్పటి నుంచీ జాతీయ సర్వేల్లో ఆమె ముందంజలో నిలుస్తూ వచ్చారు. మధ్యలో కమలకు, ట్రంప్ కు గ్యాప్ తగ్గిపోయినా.. ఆమెదే పైచేయిగా సర్వేలు తేల్చారు. ఇక ఫైనల్ సర్వేల్లోనూ కమల ఆధిక్యంలో ఉన్నారని వెల్లడైంది. ఫైనల్ సర్వేల ప్రకారం కమల 48 శాతం పాయింట్లతో ముందంజలో ఉండగా, ట్రంప్ 47 శాతం పాయింట్లతో వెనకబడ్డారని తేలింది.