US infant mortality: అమెరికాలో భారీగా పెరిగిన శిశు మరణాలు..అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే

అమెరికాలో శిశుమరణాలు ఆందోళనకరస్థాయిలో పెరిగాయి. అబార్షన్ హక్కు రద్దు తర్వాత కొన్ని నెలల్లోనే శిశు మరణాలు బాగా పెరిగాయని తాజా అధ్యనాలు చెబుతున్నాయి.తాజా స్టడీస్ ప్రకారం..మూడు నెలల్లో అంటే అక్టోబర్ 2022,మార్చి 2023, ఏప్రిల్ 2023 నెలల్లో శిశు మరణాల రేటు సాధారణం కంటే దాదాపు ఏడు శాతం ఎక్కువగా ఉన్నాయి. ఆ నెలల్లో సగటున 247 శిశు మరణాలకు దారితీసింది. 

గర్భస్రావానికి సంబంధించిన జాతీయ హక్కును రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పు తర్వాత కొన్ని నెలల్లోనే శిశు మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని చాలా ప్రాంతాలలో అబార్షన్ యాక్సెస్‌ను పరిమితం చేయడం వల్ల కలిగే పరిణామాలను ఈ పరిశోధనలు హైలైట్ చేశాయి. 

2021లో టెక్సాస్ రాష్ట్రంలో ఆరువారాల అబార్షన్ నిషేధాన్ని అమలు చేయబడింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రూపొందించిన అబార్షన్ రక్షణల చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. 

ALSO READ | శ్రీనగర్‌లో ఆర్మీ ట్రక్‌ లోయలో పడి.. ప్రాణాలు కోల్పొయిన జవాన్

అయితే ఈ శిశు మరణాలకు లోపాలతో పుట్టే పిల్లల సంఖ్య పెరగడమే కారణమని స్పష్టం చేస్తున్నాయి. గుండె లోపాలు, న్యూరల్ ట్యూబ్ లోపాలు, క్రోమోజోమ్ అసాధారణతలు ,ఇతర అవయవ వ్యవస్థ వైకల్యాలు వంటి లోపాలు శిశు మరణాలకు కారణమవుతున్నాయి. 

ప్రస్తుతం అమెరికాలోని 21 రాష్ట్రాలు అబార్షన్ హక్కును నిషేధించాయి. 18 వారాలు లేదా అంతకంటే తక్కువ గర్భధారణ పరిమితులకు ప్రక్రియను పరిమితం చేశాయి.