bird flu(H5N1)Case: అమెరికాలో ఫస్ట్ బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది..

అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది.అమెరికాలోని దక్షిణ రాష్ట్రమైన లూసియానాలో ఈ కేసు నమోదు అయింది.. 65 యేళ్ల వృద్ధుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతతో అస్పత్రిలో చేరిన వృద్ధుడిని పరీక్షించగా బ్లడ్ ఫ్లూ సోకినట్లు వెల్లడైంది. 

అమెరికాలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) బుధవారం (డిసెంబర్19)న కీలక విషయాలు వెల్లడించింది. USలో H5N1 బర్డ్ ఫ్లూ మొదటి తీవ్రమైన కేసును CDC నిర్ధారించింది.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) లెక్కల ప్రకారం.. 2024లో అమెరికాలో మొత్తం 61 మందికి H5N1 సోకింది. ఇందులో 60 కేసులలో 37 పాడి ఆవుల నుంచి, 21 పౌల్ట్రీ నుండి, రెండు తెలియని మూలాల నుండి వైరస్ సోకింది.

 శుక్రవారం నాడు ఊహాజనిత కేసు మొదట లూసియానాలో కనుగొనబడింది. అదే రోజు CDC పరీక్షల ద్వారా నిర్ధారించబడింది. అయితే ముఖ్యంగా లూసియానా రోగిలోని వైరస్, పాడి ఆవుల మధ్య వ్యాప్తి చెందుతున్న వైరస్ కు జన్యుపరంగా భిన్నంగా ఉందని తెలిపింది.