విజయానికి చేరువలో ట్రంప్... కమలాహ్యారీస్ స్పీచ్ క్యాన్సిల్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో  రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయానికి చేరువలో ఉన్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 247 ఓట్లు వచ్చాయి.   డెమొక్రటిక్ అభ్యర్థిని కమలా హ్యారీస్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. అగ్రరాజ్యం అధ్యక్ష పదవి దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ ఓట్లు రావాలి. అయితే ఈ ఫిగర్ కు ట్రంప్ ఇంకా 23 ఓట్ల దూరంలోనే ఉన్నారు. కమలా హ్యారీస్ విజయం సాధించాలంటే ఇంకా 56 ఓట్లు రావాల్సింది. కానీ ప్రస్తుతం కొనసాగుతోన్న ఆధిక్యం చూస్తే  ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉండటంతో అతడికే  విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 ట్రంప్ విజయానికి చేరువవుతుండటంతో మద్దతు దారులు సంబరాలు చేసుకుంటున్నారు.  వెస్ట్ పామ్ బీచ్ లోని కన్వెన్షన్ సెంటర్ కు క్యూ కడుతున్నారు గెస్టులు. 
 మరో వైపు ట్రంప్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహ్యారీస్  ఆమె ప్రసంగాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆమె ఇవాళ మాట్లాడబోరని..నవంబర్ 7న మాట్లాడుతారని ఆమె మద్దతుదారులు ప్రకటించారు.  

మరో వైపు ట్రంప్ కు మద్దతిచ్చిన ఎలన్ మస్క్.. మొత్తానికి అమెరికా ప్రజలు మార్పు కోరుకున్నారని ట్వీట్ చేశారు.