అదానీపై లంచం ఆరోపణ కేసు:యుఎస్ అటార్నీ రాజీనామా

అదానీపై లంచం అరోపణలు చేసిన యూఎస్ అటార్నీ బ్రియాన్ పీస్ రాజీనామా ప్రకటించారు. ట్రంప్ మరికొద్దిరోజుల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న సమయంలో అమెరికా అంతరంగిక విషయాల్లో కీలక పరిణామాలు చోటుచేకున్నాయి. చర్చనీయాంశంగా మారింది.2025, జనవరి 10న యూఎస్ అటార్నీగా బ్రియాన్ పీస్ రాజీనామా చేస్తున్నారని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. 

యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం.. 2021 అక్టోబర్ 15నుంచి పీస్ ఈ పదవిలో ఉన్నారు.పీస్ తర్వాత ఆయన స్థానంలో యాక్టింగ్ అటార్నీగా మొదటి అసిస్టెంట్ అటార్నీ కరోలిన్ పోకోర్ని ఉంటారు. 

Also Read :- ఫస్ట్ బర్డ్ ఫ్లూ కేసు బయటపడింది

బ్రియాన్ పీస్ తన పదవీ కాలంలో అమెరికా ప్రజల అభివృద్దికి కృషి చేశారు. న్యూయార్క్‌లోని తూర్పు జిల్లాలో ఎనిమిది మిలియన్ల మంది నివాసితులకు రక్షణ కల్పించడం, చట్టాన్ని అమలు చేయడం, ప్రజలందరికీ పౌర హక్కులు ,గౌరవాన్ని కాపాడేందుకు బ్రియాన్ పీస్ వ్యూహాత్మకంగా పనిచేశారు. 

ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త, బిలియనీర్ అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ, మరికొంతమందిపై బ్రియాన్ పీస్ సంచలన ఆరోపణలు ప్రకటించివారిలో బ్రియాన్ పీస్ కూడా ఉన్నారు. అయితే నవంబర్ లో అదానీ గ్రూప్ లంచం ఆరోపణలను నిరాధారణమని గట్టిగా కొట్టిపారేసింది.