ఉర్సు ఉత్సవాలకు బిజగిరి షరీఫ్ దర్గా ముస్తాబు

జమ్మికుంట, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహు అలై దర్గా ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. 19 వరకు జరిగే ఉత్సవాలకు దర్గాను ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, ఏపీ నుంచి  వేలాది మంది భక్తులు తరలివస్తారు. 

కొన్నేండ్లుగా ఇక్కడ కులమతాలకతీతంగా ఉర్సు వేడుకలు జరుగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా సోమవారం సాయంత్రం గుసల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గా ముతావళి మహ్మద్, అక్బర్ అలీ దర్గా కమిటి అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో దర్గా ముజావర్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తెచ్చిన చాదర్లను దర్గాలోని సమాధులకు ఆలంకరించనున్నారు.