బడాపహాడ్‌‌ ఉర్సు ఉత్సవాలు షురూ

వర్ని, వెలుగు: బడాపహాడ్‌‌ లో హజ్రత్‌‌ సయ్యద్‌‌ షాదుల్లా హుస్సేన్​దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాల్లో జరగానున్నాయి. మొదటి రోజు జలాల్‌‌పూర్‌‌ నుంచి  బడాపహాడ్‌‌ దర్గాకు సందాల్​తీసుకొచ్చారు. భక్తులకు హజ్రత్​సయ్యద్​బాబాకు భక్తులు గంధం, ఛాదర్, పూలు సమర్పించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌‌ భాస్కర్‌‌ రెడ్డి ప్రార్థనలు చేసి సందాల్‌‌ ఎత్తుకొని కొద్దిదూరం నడిచారు. 

అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జి ఏనుగు రవీందర్‌‌రెడ్డి తమను ప్రోగ్రామ్​కు ఆహ్వానించి కార్యక్రమానికి రాకముందే సందాల్​ తీసుకొని ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రవీందర్​రెడ్డిని సర్దిచెప్పిన ప్రోగ్రామ్​ నిర్వాహకులు ఆయన తలపై సందాల్​ఎత్తారు. దర్గాపై సరైన వసతులు కల్పించక భక్తులు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి, బాత్రూమ్​లు శుభ్రంగా లేకపోవడంపై  పలువురు ఆగ్రహం చేశారు.