నిర్మాణ పనుల్లో క్వాలిటీ తప్పనిసరి : ఎమ్మెల్యే ధన్​పాల్ 

నిజామాబాద్, వెలుగు : నగరంలో నడుస్తున్న రోడ్​నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ అన్నారు.  మంగళవారం ఆయన ఆర్​అండ్​బీ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. అర్సపల్లి ఆర్వోబీ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని, పాత కలెక్టరేట్​ గ్రౌండ్​లో స్పోర్ట్స్ ట్రాక్​ నిర్మించాలని, మినీ స్టేడియం ప్రతిపాదనలు గవర్నమెంట్​కు పంపాలని కోరారు.  

రోడ్​ రిపేర్ల కోసం తవ్విన గుంతలను వెంటనే పూడ్చాలని, నాగారంలో డబుల్​బెడ్​రూం ఇండ్ల రిపేర్లు త్వరగా ముగించాలని సూచించారు. ఆర్​అండ్​బీ ఎస్​ఈ హనుమంతరావు, ఈఈ మురళి, డీఈ ప్రవీణ్​, ఏఈలు సాయికుమార్​, గంగాధర్​ తదితరులు ఉన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరు భగవద్గీత చదువాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ కోరారు. నగరంలోని ఉమామహేశ్వర గుడిలో అయ్యప్ప భక్తులు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకు ఆయన అటెండ్ అయ్యారు.