బోనమెత్తిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్, వెలుగు : నగరంలో ఆదివారం నిర్వహించిన మహాలక్ష్మి బోనాల పండగలో అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనమెత్తుకొని ఊరేగింపులో భాగస్వామ్యులయ్యారు. తెలంగాణ సంప్రదాయంలో బోనాలకున్న విశిష్టత చాలా గొప్పదన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానని అన్నారు. 22 డివిజన్​ కార్పొరేటర్​ పంచరెడ్డి, లావణ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఆనంద్​పవన్​, కార్తీక్, సతీశ్, హరీశ్, కృష్ణ, బాబీ సింగ్, తదితరులున్నారు.