నిజామాబాద్, వెలుగు : ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం చేయడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెళ్లారు. అక్కడ సెటిల్అయిన తెలుగువారి ఇండ్లకు వెళ్లి మోదీని గెలిపించాలని కరపత్రాలు పంచుతున్నారు.
విశ్వ గురువుగా మారిన మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రపంచ నేతలు కోరుకుంటున్నారని, భారత్ ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సాటి లేకుండా ఎదుగుతోందని ప్రచారం చేశారు.
వారణాసిలోని తెలుగువారంతా మోదీని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారని ధన్పాల్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, గజానంద్ జోషి, మహేశ్ తదితరులు ఉన్నారు.