Google chrome update : గూగుల్ క్రోమ్​ అప్​డేట్ చేయకపోతే డేంజరా?

డెస్క్‌‌టాప్ సిస్టమ్‌‌లలో గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ ఉందని.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)  హెచ్చరిక జారీ చేసింది. సిస్టమ్‌‌లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్రోమ్ బ్రౌజర్‌‌లను వెంటనే అప్‌‌డేట్ చేయాలని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన డివైజ్ ద్వారా రిమోట్ కంట్రోల్‌‌ని వాడి సైబర్ దాడికి పాల్పడొచ్చు. దాంతో సున్నితమైన డాటాను యాక్సెస్ చేయొచ్చు. హానికరమైన సాఫ్ట్‌‌వేర్‌‌ను ఇన్‌‌స్టాల్ చేయొచ్చు లేదా సిస్టమ్‌‌ను పూర్తిగా షట్ డౌన్ కూడా చేయొచ్చు. కాబట్టి అలాంటి సైబర్ దాడిలో చిక్కుకోకుండా సేఫ్‌‌గా ఉండాలంటే.. ఈ సూచనలు పాటించాలి.

క్రోమ్ అప్‌‌డేట్ : క్రోమ్ బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌‌కి అప్‌‌డేట్ చేయాలి. క్రోమ్ అప్‌‌డేట్ చేసేందుకు బ్రౌజర్ మెనుకి వెళ్లి, “హెల్ప్​”, తర్వాత “ఎబౌట్ గూగుల్ క్రోమ్​” సెలక్ట్ చేయాలి. అప్పుడు బ్రౌజర్ ఆటోమెటిక్‌‌గా అప్‌‌డేట్స్ కోసం చెక్ చేసి వాటిని ఇన్‌‌స్టాల్ చేస్తుంది.

ఆటోమేటిక్ అప్‌‌డేట్‌ ‌: ఫ్యూచర్​లో సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్ ఆటోమెటిక్ అప్‌‌డేట్‌‌లను ఎనేబుల్ చేయాలి. బ్రౌజర్ ఎల్లప్పుడూ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌‌లను కలిగి ఉండాలి.