గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొట్ట కూటికోసం ఉపాధి హామీ పనులకు వెళ్లిను కూలీ ప్రాణాలు కోల్పోయాడు. పనిచేస్తున్న ఫీల్డ్ లోనే గుండెపోటుతో కుప్పకూలి పోయాడు.. తోటి కూలీలు ఆస్పత్రికి తరలించేలోపు స్పాట్ లోనే చనిపోయాడు. 

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జప్తి జాన్కంపల్లిలోని  మల్లాది చెరువు వద్ద ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ భూమని రాములు కూడా పనులు చేస్తున్నాడు. శనివారం (మే4) ఉదయం 11 గంటల ప్రాంతంలో మల్లాది చెరువులో ఉపాధి పనుల్లో చేస్తుండగా భూమని రాములుకు గుండెపోటు వచ్చింది. దీంతో స్పాట్ లోనే కుప్పుకూలి పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా చనిపోయాడు.