అగర్తల: దేశ విభజనకు కాంగ్రెస్సే కారణమని, ఇది పాకిస్తాన్ ఏర్పాటుకు దారి తీసిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సోమవారం పశ్చిమ త్రిపురలోని బర్కథాల్లో సిద్ధేశ్వరి టెంపుల్‌ను యోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్య పోరాట సమయంలో క్రియాశీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ముస్లిం లీగ్‌కు మద్దతిచ్చింది. ఇండియాను విభజించా లని ముస్లిం లీగ్ బలంగా కోరుకుంది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆవిర్భవించిం ది. బెంగాల్ ను విభజించాలని1905లో బ్రిటీష్ వాళ్లు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ప్రజలు వ్యతిరేకించడంతో అది విఫలమైంది. ఇదేవిధంగా ముస్లిం లీగ్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తే పాకిస్తాన్ ఏర్పాటును నివారించేవాళ్లం. పాకిస్తాన్ క్యాన్సర్ వంటిది. అది విధ్వంసం సృష్టిస్తుంది” అని తెలిపారు.