Bandi Sanjay: బీజేపీ అధ్యక్ష పదవి పోటీలో లేను..కేంద్ర మంత్రి బండిసంజయ్ క్లారిటి

కరీంనగర్: తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవీ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. 

తాను అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని అన్నారు బండి సంజయ్. ‘‘నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి కంటే పెద్ద బాధ్యతను అధిష్టానం ఇచ్చింది. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో పనిచేస్తున్నాను’’ అని బండి సంజయ్ అన్నారు. 

ALSO READ | ‘పొడుస్తున్న పొద్దు మీద’ పాట వింటే రోమాలు నిక్కపొడిచేవి: హరీష్ రావు

‘‘రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఇప్పటివరకు మా పార్టీ పెద్ద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..పార్టీ అధ్యక్ష పదవి విషయంలో సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు.. తాను అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు రాయడం వల్ల నాకు వ్యక్తిగతంతా నష్టం వాటిల్లుతోంది..పార్టీకి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దని’’ బండి సంజయ్ సూచించారు.