వినాయక చవితి స్పెషల్.. గణనాథుడితో కేంద్రమంత్రి బండి సెల్ఫీ

కరీంనగర్: రాష్ట్ర ప్రజలకు కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలన్నీ తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. వినాయక చతుర్థి సందర్భంగా కరీంనగర్‏లోని మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన గణనాథుడిని బండి సంజయ్ ఇవాళ (సెప్టెంబర్ 7) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గణనాథుడికి  బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం గణనాథుడితో బండి సంజయ్ సెల్ఫీ దిగారు.