నష్టాలను పూడ్చుకోవటానికి అమెజాన్ ఇండియాలో వ్యాపారం

దేశంలో అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు విస్తరించడంపై కేంద్ర కామర్స్ మినిస్టర్ పీయూష్‌‌‌‌ గోయెల్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల కోత పెరుగుతుందని పేర్కొన్నారు. అమెజాన్ ఇండియాలో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాననడంపై ఆయన మాట్లాడారు. దేశానికి  అమెజాన్ ఎటువంటి సేవ చేయడం లేదని, వారి బ్యాలెన్స్ షీట్‌‌‌‌లోని నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తోందని అన్నారు. ధరలను బాగా తగ్గించి ప్రొడక్ట్‌‌‌‌లు అమ్మడంతో వచ్చిన నష్టాలను  అమెజాన్ పూడ్చుకుంటోందని చెప్పారు. ప్రొఫెషనల్స్‌‌‌‌కు రూ.1,000 కోట్లు చెల్లించడం ద్వారా నష్టం వచ్చిందని అంటున్నారని, ఈ ప్రొఫెషనల్స్ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. తమపై కేసు ఎవరూ గెలవకుండా ఉండేందుకు టాప్ లాయర్లకు ఇంత మొత్తం చెల్లించి ఉండొచ్చని పేర్కొన్నారు.

ALSO READ | ఇండియాలో రూ.933 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న డెకాథ్లాన్‌