యూనియన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ .. రూ. 5 కోట్లతో పరార్‌‌‌?

  • ఖాతాదారులకు పెద్ద మొత్తంలో లోన్లు ఇప్పించి సొంతానికి వాడుకున్న వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

నిజామాబాద్, వెలుగు: ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా, వారి పేరున లోన్లు మంజూరు చేసి వాటిని సైతం తన సొంతానికి వాడుకున్న ఓ బ్యాంక్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ కనిపించకుండా పోయాడు. నిజామాబాద్‌‌‌‌ నగరంలోని శివాజీనగర్‌‌‌‌ యూనియన్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌లో అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ అనే వ్యక్తి రెండేళ్లుగా సీనియర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఇతడు పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా బిజినెస్‌‌‌‌, పర్సనల్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌, హౌజింగ్‌‌‌‌, ఓడీ తదితర పేర్లతో సుమారు 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.

 తర్వాత ఖాతాదారులకు నచ్చజెప్పి ఆ డబ్బులను తన సొంతానికి వాడుకున్నాడు. మధుసూదన్‌‌‌‌రావు అనే వ్యక్తి గతంలోనే హౌజింగ్‌‌‌‌, ముద్ర లోన్‌‌‌‌ తీసుకున్నప్పటికీ మరో లోన్‌‌‌‌ ఇస్తానంటూ పిల్చి రూ. 15 లక్షల లోన్‌‌‌‌ ఇప్పించాడు. తాను ఇల్లు కడుతున్నానని ఆ డబ్బులను తాను వాడుకుంటానని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. అలాగే మరో ఇద్దరు వ్యాపారులకు బిజినెన్‌‌‌‌ లోన్‌‌‌‌ పేరుతో రూ.40 లక్షలు శాంక్షన్‌‌‌‌ చేసి వారి వద్ద నుంచి బ్లాంక్‌‌‌‌ చెక్కులు తీసుకొని డబ్బులను డ్రా చేసుకొని సొంతానికి వాడుకున్నాడు. 

మేనేజర్‌‌‌‌ అజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ నాలుగు రోజుల నుంచి బ్యాంక్‌‌‌‌కు రాకపోవడం, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌లో కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు బుధవారం 4వ టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు వచ్చి ఎస్సై పాండేరావుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం సుమారు రూ. 5 కోట్లతో మేనేజర్‌‌‌‌ పరార్‌‌‌‌ అయినట్లు తెలుస్తోంది.