హుజూర్ నగర్ లో పట్టపగలు రూ 14.5 లక్షలు చోరీ

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ లో బుధవారం పట్టపగలు రూ. 14 లక్షల 50 వేలు చోరీ జరిగింది. బాధితుడు పోలిశెట్టి వెంకటేశ్వర్లు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగానే ఎస్ బీహెచ్ బ్యాంకు నుంచి మిల్లుకు సంబంధించి రూ. 14.5లక్షలు  డ్రా చేసుకొని హైవేపై మిర్యాలగూడ రోడ్డులోని మిల్లుకు వెళ్తున్నాడు. 

ఈ క్రమంలో అడ్డ రోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగులు ఆ డబ్బు సంచిని లాక్కెళ్లినట్టు తెలిపారు. వెంటనే 100కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.