రెడ్ క్రాస్ ​ఆధ్వర్యంలో హెల్త్​ క్యాంప్

పిట్లం, వెలుగు : ఇండియన్​ రెడ్​క్రాస్​ఆధ్వర్యంలో బిచ్కుంద మండలం ఖత్​గాంలో శనివారం హెల్త్​క్యాంప్​ నిర్వహించారు. శిబిరాన్ని స్థానిక మఠాధిపతి మల్లికార్జున్​స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు వృద్ధులకు రక్త పరీక్షలు, ఈసీజీలు, సాధారణ టెస్ట్​లు నిర్వహించి

 అవసరమున్నవారికి మందులు అందజేశారు. రెడ్​క్రాస్​ డివిజన్​వైస్​చైర్మన్ ​డాక్టర్ ​విక్రమ్​ కుమార్, జిల్లా కోశాధికారి దస్తీరాం, డాక్టర్ ఉమాకాంత్, బిచ్కుంద చైర్మన్​ కోలావార్ ​కుమార్, వైస్​చైర్మన్​రచ్చ శివకాంత్, సభ్యులు డాక్టర్​నర్సింలు, బస్వరాజ్, హన్మండ్లు పాల్గొన్నారు.