బీహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బ్రిడ్జి అది.. భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్‌గంజ్‌ను ఖగారియా జిల్లాలోని అగువానీ ఘాట్‌తో కలిపేందుకు నితీష్ కుమార్ కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా భావించిన వంతెన అది..కారణాలు ఏవైనా ఈ బ్రిడ్జి నిర్మాణానికి అన్నీ అడ్డుంకులే.. నిర్మాణంలో ఉండగానే మూడు సార్లు కూలిపోయింది. నిర్మాణంలో నాణ్యత లోపమా.. లేక ఇంకా ఏదైనా కారణమా అనేది పక్కన బెడితే.. నిర్మాణం మొదలు పెట్టి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. కూలడానికే కడుతున్నారా.. అనేలా మరోసారి కూలింది. శనివారం నాడు బీహార్‌లో నిర్మాణంలో ఉన్న సుల్తంగంజ్-అగువానీ ఘాట్ వంతెన ఒక భాగం కూలిపోయి గంగా నదిలో పడిపోయింది.వివరాల్లోకి వెళితే..
अगुवानी सुल्तानगंज में गंगा पे निर्माणाधीन पुल फिर तीसरी बार गिरा ।पूरा system भ्रष्टाचार में लिप्त हैं ।मैं लगातार बोल रहा था कि फिर गिरेगा लेकिन आज तक किसी पे कोई कार्यवाही नहीं हुईं।ना अधिकारी पे ,ना एस.पी सिंघला कंपनी पे ,ना रोडिक कन्सल्टेंसी पे। @narendramodi @nitin_gadkari pic.twitter.com/HLnA3EkaXB
— Dr.Sanjeev Kumar MLA Parbatta,Bihar (@DrSanjeev0121) August 17, 2024
శనివారం ఆగస్టు17,2024న నిర్మాణ స్థలంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలడాన్ని ప్రత్యక్ష సాక్షులు కెమెరాలో బంధించారు. ఈ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫాలం లలో షేర్ చేశారు. భాగల్పూర్ వైపు ఉన్న వంతెన ఒక భాగం జూన్ 30, 2022న కుప్పకూలింది.. పిల్లర్ నంబరు 5 , 6 మధ్య ఉన్న ఎక్స్ టెన్షన్ బ్రిడ్జీ గంగా నదిలో పడిపోయింది.
బ్రిడ్జి నిర్మాణం, లక్ష్యం..
అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టినప్పటినుంచి కూలడమే తప్పా.. నిలబడిన సందర్భం లేదు.. 2015 లో నిర్మాణ పనులు చేపట్టగా.. 2022 జూన్ లో ఒకసారి,2023 జూన్ లో మరోసారి, తాజాగా ఆగస్టు 17, 2024లో ఇంకోసారి కూలింది. దీంతో వంతెన పదే పదే కూలిపోవడంతోనిర్మాణ నాణ్యత, ప్రాజెక్ట్ అలైన్ మెంట్ పై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకించి ఈ వంతెన నిర్మాణ ప్రాజెక్ట్ చేపట్టిన సంస్త SK సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ Ltd ... ఈ సంఘటనకు సంబంధించి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.