తండ్రి మరణం తట్టుకోలేక.. కొడుకు గుండెపోటుతో మృతి

నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు..తండ్రి మరణవార్త విని గల్ఫ్ లో ఉన్న కొడుకు కడసారి చూపుకోసం స్వగ్రామానికి వచ్చాడు.దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అయితే తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు..తండ్రి మరణించిన నాలుగు రోజులకు గుండెపోటుతో తాను చనిపోయాడు. హృదయ విదారక ఘటన శనివారం ఆగస్టు 17, 2024 నాడు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో జరిగింది. 

గంభీర్ పూర్ కు చెందిన  రమేష్ (43) ఉపాధికోసం గల్ఫ్ లో ఉంటున్నాడు.  నాలుగు రోజుల క్రితం రమేష్ తండ్రి గంగరాజు అనారోగ్యంతో మృతిచెందాడు..విషయం తెలుసుకున్న రమేష్ తండ్రి అంత్యక్రియలకు గ్రామానికి వచ్చాడు..దహన సంస్కారాలు నిర్వహించాడు..కానీ తండ్రితో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటూ కు మిలిపోయాడు. 

రెండు రోజులుగా రోదిస్తుండటంతో రమేష్ శనివారం గుండెపోటుకు గురయ్యాడు..చికిత్స కోసం కోరుట్ల ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యలో చనిపోయాడు.. నాలు గు రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.