రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి..9/11 తరహాలో అటాక్

రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం( డిసెంబర్ 21) రష్యాలోని కజాన్ పట్టణంపై 9/11 తరహాలో ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది.ఓ నివాస భవనం లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడులో భవనంలో పెద్ద పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యా ప్రకటించింది. అయితే దాడులు మాత్రం 2001నాటి దాడులను తలపించాయి. 

రష్యా , ఉక్రెయిన్ మధ్య దాడులు, ప్రతిదాడులు మరింత పెరిగాయి. అమెరికా, పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్.. రష్యాపై ఉధృతంగా దాడులు చేస్తోంది. శనివారం అమెరికా సరఫరా చేసిన లేటెస్ట్ డ్రోన్లతో ఉక్రెయిన్ రష్యాపై దాడి పాల్పడింది. 

మరోవైపు రష్యా కూడా కీవ్ లక్ష్యంగా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. శుక్రవారం అర్థరాత్రి 112 డ్రోన్లతో కీవ్ పై విరుచుకుపడింది. రష్యా డ్రోన్ దాడులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటించింది.. 57 రష్యన్ డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైనిక వర్గాలుతెలిపాయి. 

అంతకుముందు శుక్రవారం మాస్కో సమీపంలోని  కుర్క్స్  రిజియన్ లో ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో ఐదుగురు మృతిచెందారని రష్యా ఆరోపించింది.. మరోవైపు  కీవ్ పై రష్యా జరిపిన దాడుల్లో ఒకరు చనిపోయారని ప్రకటించింది.