- భార్య ఫిర్యాదుతో ఎంక్వైరీ, చర్యలు
- ఆరోపణలు నిరాధారమని మాజీ వీసీ టూలీ
లండన్: హైదరాబాద్ కు చెందిన యువతితో లైంగిక సంబంధం ఉందనే ఆరోపణలపై యూకే లోని బకింగ్‌హామ్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ జేమ్స్ టూలీ ని సస్పెండ్ చేశారు. 65 ఏండ్ల టూలీ 2020 నుంచి ఆ వర్సిటీకి వీసీగా ఉన్నారు. టూలీ భార్య సింథియా ఫిర్యాదు, ఆమె ఇచ్చిన సాక్ష్యాల మేరకు ఇండిపెండెంట్ ఎక్వైరీ కమిటీ వేసి ఈ చర్యలు చేపట్టారు. టీవీ ప్రజెంటర్ అయిన 42 ఏండ్ల సింథియా 2022లో టూలీని పెండ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనతో విడిపోయి వేరుగా ఉంటున్నారు. వర్సిటీ అధికారులు అక్టోబర్ నెలలో ఆయన్ను సస్పెండ్ చేయగా తాజా వెలుగు చూసింది.
ఎడ్యూకేషన్ పాలసీల తయారీలో నిపుణుడైన జేమ్స్ టూలీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేద వర్గాల పిల్లలకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రైవేటు విద్యను అందించే ప్రాజెక్టులో భాగంగా ఆయన 15 ఏండ్ల కింద హైదరాబాద్‌లో పనిచేశారు. ఆ సమయంలో ఒక యువతితో ఆయన లైంగిక సంబంధం కొనసాగించారు. ఆ విషయాన్ని సదరు యువతి తన డైరీల్లో పేర్కొన్నది. ఆ డైరీలనే యువతి ఇటీవల సింథియాకు పంపించింది. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడాని ఫీజులు కూడా చెల్లించినట్టు సమాచారం. దీనిపై జేమ్స్టూలీ స్పందిస్తూ తనపై ఆరోపణలు నిరాధారమైన, ద్వేషంతో కూడుకున్నవని పేర్కొన్నారు. వాస్తవాలు త్వరలోనే నిరూపణ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.