Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే

ఆధార్ కార్డు.. ఇది ప్రస్తుతం చాలా ముఖ్యమైన డాక్యుమెంట్..ఐడీ కార్డు అవసరమయ్యే ప్రతిచోటా ఇది లేకుండా పనిజరగదు. ఆధార్ కార్డు లేకుండా ఏ ప్రభుత్వ పథకమూ అందుకోలేం. అలాంటి ఆధార్ కార్డులో తప్పులుంటే..పెద్ద సమస్యే.గతంలో ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఇతర సమాచారంలో ఏదైన తప్పులున్నా..ఇంటివద్ద నుంచి  కూడా ఈజీగా మార్పులు చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి.. ఆధార్ కార్డులో పేరులో ఏవైనా తప్పులుంటే మార్పు చేయాలంటే రూల్స్ మరింత కఠినతరం చేసింది ఉడాయ్(UIDAI).

UIDAI కొత్త రూల్స్ ప్రకారం.. ఆధార్ కార్డులో పేరులో ఏదైనా తప్పులున్నా.. అక్షరాలు మార్చాలన్నా.. తప్పనిసరి గెజెట్ నోటిఫికేషన్ అవసరం..దీంతో పాటు ఆధార్ కార్డు హోల్డర్.. పూర్తి పేరును సూచించే ఐడీ కార్డును సబ్మిట్ చేయాలి.. పాన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ, పాస్ పోర్టు లాంటి ఐడీ కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. 

 ఆధార్ కార్డులో పేరు మార్పిడి విషయంలో నిబంధనలు మరింత కఠినతరం చేసిన ఉడాయ్.. అడ్రస్ లో మార్పులు, కొత్త ఆధార్ కార్డు కోసం నమోదు వంటి వాటికి నిబంధనలు మరింత సులభం చేసింది. గతంలో అడ్రస్ ప్రూఫ్ కింద ఇంటి కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఐడీ కార్డు, ఇతర ఐడీ కార్డులను అనుమతించిన ఉడాయ్.. తాజాగా బ్యాంక్ పాస్ బుక్ ను కూడా అడ్రస్ ప్రూఫ్ కింద ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది. బ్యాంక్ పాస్ బుక్ లోని అడ్రస్ తో కొత్త ఆధార్ కార్డు, లేదా అడ్రస్ మార్పు చేసుకోవచ్చని తెలిపింది.