ఉగాది ముందు రోజు సుదీర్ఘ సూర్యగ్రహణం.... 54 ఏళ్ల తరువాత అద్భుతం...

ఉగాది ముందు రోజు సంపూర్ణ ... సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  ఖగోళ శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం ఇలాంటి సుదీర్ఘ సూర్యగ్రహణం 54 ఏళ్ల క్రితం ఏర్పడిందని తెలుస్తోంది.  1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడింది. సోమవారం ( ఏప్రిల్ 8)న ఏర్పడే సుదీర్ఘ సూర్యగ్రహణం ఎన్నిగంటలు ఉంటుంది.. ఏ సమయంలో ఏర్పడుతుంది.... ఎన్ని మైళ్ల మేరకు .. ఏఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనువిందు చేస్తుందో తెలుసుకుందాం. . . . 

2024  మొట్టమొదటి సూర్యగ్రహణం సోమవారం  ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి. 1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది భారత్‌లో కనిపించదు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్‌లో రాత్రి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం ఏడున్నర నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలుముకుంటాయి.ఈ అద్భుతం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై, అమెరికా సంయుక్త రాష్ట్రాల గుండా ప్రయాణించి, తూర్పు కెనడాలో ముగుస్తుంది. ఆ ప్రాంతాల్లోని మిలియన్ల మందికి ఈ గ్రహణం దృశ్యాలు కనిపిస్తాయి.

ఏప్రిల్ 8న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై.. ఏప్రిల్ 9న మధ్యాహ్నం 02:22 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం ముగుస్తుంది. 

గ్రహణం గరిష్ఠ వ్యవధి 4గంటల 28 సెకన్లు. ఇది 2017లో ఏర్పడిన సూర్యగ్రహణం కంటే రెట్టింపు సమయం. ఈ గ్రహణం కనువిందు చేసే 115 మైళ్ల వెడల్పుగల కారిడార్‌లో సుమారు 44 మిలియన్ల మంది నివసిస్తున్నారు. మజాట్లాన్, మెక్సికో నుంచి న్యూఫౌండ్‌ ల్యాండ్ వరకు, అలాగే యునైటెడ్ స్టేట్స్‌లోని ఎక్కువ ప్రాంతాల ప్రజలకు దీనిని చూసే అవకాశం లభించనుంది.

సంపూర్ణ సూర్యగ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి. ఎందుకంటే వాటిని చూసేందుకు భూమిపై అనువైన ప్రదేశాలు తక్కువ. భూమి ఎక్కువ భాగం దాదాపు మూడు వంతులు మహా సముద్రాలతో నిండి ఉంది. మిగిలిన భూభాగం నుంచి సంపూర్ణ సూర్యగ్రహణాలను వీక్షించే అవకాశాలు చాలా తక్కువ. ఇలాంటి గ్రహణాలు సాధారణంగా సుదూర, నిశ్శబ్ద ప్రదేశాలలో ఏర్పడతాయి. దీంతో వాటిని చూసే అవకాశం ఉండదు.
 
సూర్యుడు, భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు.. ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. జాబిల్లి నీడ సూర్యుడిని పూర్తిగా కప్పి ఉంచే ప్రదేశాల్లో గ్రహణం ఏర్పడుతుంది. ఈ మార్గాన్ని సంపూర్ట మార్గం(పాత్ ఆఫ్ టోటలిటీ) అని అంటారు. ఈ సమయంలో ఆకాశం చీకటిగా మారిపోయి.. సూర్యోదయం సూర్యాస్తమయంలా కనిపిస్తుంది. 

సాధారణంగా సూర్యగ్రహణాన్ని నేరుగా చూడలేం. వివిధ రకాల కళ్లద్దాలు....  ఇతర పరికరాలను సాయంతో చూడవచ్చు. . అమెరికా మసాచుసెట్స్‌‌ రాష్ట్రం వాటర్‌టౌన్‌ నగరంలోని పెర్కిన్స్‌ అంధుల పాఠశాల 'లైట్‌సౌండ్‌' (Light Sound Device Eclipse) పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని అసిస్టివ్‌ టెక్నాలజీ మేనేజర్‌ మిన్‌ హా పరీక్షించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ పరికరం రకరకాల కాంతి ధ్వనులను అనుభూతి చెందేలా, తద్వారా ఆ ఖగోళ దృశ్యాన్ని అంధులు ఆస్వాదించేలా చేస్తుంది.