ఏప్రిల్​ 9 ఉగాది రోజున ఇలా చేస్తే.. కోటీశ్వరులే..

ఉగాది .. సంవత్సరాది.. అంటే సంవత్సరం ఆరంభం అయ్యే రోజు.. తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు ఎలా గడిపితే  ఏడాది అంతటా అలానే గడుపుతారని పండితులు చెబుతుంటారు.  ఆ రోజు ఏం చేయాలి...  ఆ రోజు (ఏప్రిల్​ 9)న ఏ దేవుడిని పూజించాలి..  ఎలా ఆరాధిస్తే అష్ట ఐశ్వరాలతోపాటు భోగ భాగ్యాలు కలుగుతాయి.. పురాణాలు.. ఇతిహాసాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. . . 

ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ( సూర్యోద‌యానికి ముందుగా) కాల‌కృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు రాపి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. ఆ తరువాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి...  విష్ణుమూర్తి, ల‌క్ష్మీదేవిని పూజించాలి.  శివుడికి రుద్రాభిషేకం చేయాలి.  విష్ణుమూర్తి అష్టోత్తరం, ల‌క్ష్మీదేవి అష్టోత్తరం, లేదా విష్ణుమూర్తి స‌హ‌స్రనామం, ల‌క్ష్మీదేవి స‌హ‌స్రనామాన్ని కానీ ప‌ఠించాలి. భ‌క్తితో, విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి, ల‌క్ష్మీదేవిల‌ను. పార్వతి పరమేశ్వరులను  ఆరాధిస్తే మంచి ఫ‌లితాన్ని పొంద‌గ‌లుతార‌ని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.  ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల  స‌మ‌స్యల‌ను ఎదుర్కొనే శ‌క్తి నాకివ్వు, నాకు అష్ట ఐశ్వర్య భోగ‌భాగ్యాల‌ను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంక‌ల్పాన్ని దృఢంగా తీసుకోవాలి.  ఆ తరువాత దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. బ్రాహ్మణులకు కొత్త బట్టలు.. పంచాగం  దానం చేసి.. దక్షిణ ఇవ్వాలి. 

 తుల‌సీద‌ళ‌ముల‌తో స్వామి, అమ్మవార్లను ఆరాధించిన త‌రువాత ఉగాది ప‌చ్చడితోపాటు పాల‌తో చేసిన ఏదైనా ప‌దార్థాన్ని స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టాలి. స్వామి అమ్మవార్ల ఆరాధ‌న కోసం ఉప‌యోగించిన తుల‌సీద‌ళాన్ని గుమ్మానికి మాల‌లా ఉంచి, అలాగే, ఓ తుల‌సీ ద‌ళాన్ని మీ జేబులో ఉంచుకోవాల‌ని, ఉగాది పండుగ రోజంతా ఆ తుల‌సీద‌ళం మీ ఇంటి గుమ్మానికి, అలాగే, మీ జేబులో త‌ప్పనిస‌రి ఉంచుకోవాల‌ని పురాణ ఇతి హాసాలు చెబుతున్నాయి. అనంత‌రం ఉగాది పండుగ సంద‌ర్భంగా చేసిన ప‌చ్చడిని ప్రసాదంగా స్వీక‌రించిన త‌రువాతే ఆహారం తీసుకోవాలి.

 ఉగాది సంద‌ర్భంగా ప్రతీ ఒక్కరి ఆతృత ఒక్కటే. ఈ సంవ‌త్సరం ఎలా ఉండ‌బోతుంది అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మ‌దిలో మెదిలేదే. అందుక‌ని ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవ‌ణం చేయాలి. ఈ సంవ‌త్సరం జాత‌కంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, క‌ర్నము, వారం ఇలా అన్ని విష‌యాల‌ను తెలుసుకొని ప‌ద్ధతి ప్రకారం స్వామి అమ్మవార్లను ఆరాధిస్తూ ముందుకు పోతే, అటువంటి వారి ఇళ్లలో అష్ట ఐశ్వర్యాలతోపాటు భోగ‌భాగ్యాలు క‌లుగుతాయ‌ని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.