ఈ తుఫాన్.. వేల మందిని చంపేసింది.. సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది..!

పారిస్: హిందు మహా సముద్రంలో ఏర్పడిన చిడో తుపాన్ బీభత్సం సృష్టి్స్తోంది.  గంటకు దాదాపు 200 కిమీ వేగంతో శనివారం అర్ధరాత్రి చీడో తుపాన్ మయోట్ ద్వీపాన్ని తాకింది. దీంతో మయోట్ ద్వీపంలోని గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. చీడో తుపాన్ ప్రభావంతో మయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులైనట్లు ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చీడో తుపాన్ ప్రకోపానికి ఖచ్చితంగా వందల సంఖ్యలో మృతులు ఉంటారని..  బహుశా వెయ్యికి పైనే మృతుల సంఖ్య ఉండొచ్చని ఫ్రెంచ్ అధికారి ప్రిఫెక్ట్ ఫ్రాంకోయిస్-జేవియర్ బియువిల్లే తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

సహయక చర్యలు కొనసాగుతున్నాయని ఈ సమయంలో బాధితులు, మృతులు సంఖ్యను వెల్లడించడం కష్టమన్నారు.  గత 90 ఏళ్లలో ఇదే మయోట్ దీవులను తాకిని అత్యంత బలమైన తుపాన్ ఇదేనని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మయోట్ ద్వీపంలో చీడో తుపాన్ సృష్టించిన బీభత్సానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. మయోట్ ద్వీపంలోని ఓ కొండ మీది ప్రాంతంలో వందలాది తాత్కాలిక గృహాల శిథిలాలుగా మారాయి. మయోట్ ఆసుపత్రి వరదలతో మునిపోగా.. అందులో నుండి ఓ తల్లి తన నవజాత శిశువును కాపాడుకుంటున్న హృదయవిదారకర వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది

మరికొన్ని చోట్ల చెట్లు విరిగిపడటం, భవనాల పైకప్పుల కూలిపోయి మయోట్ ద్వీపం స్మశానాన్ని తలపిస్తోంది. చీడో తుపాన్ ప్రభావం వల్ల మయోట్ రూపురేఖలు మారిపోయాయని.. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తు్న్నారు. రెస్య్కూ బృందాలు ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. తుపాన్ బాధితులకు పునరావసం కల్పించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం తాత్కలిక ఏర్పాట్లు చేస్తోంది.

ఫ్రాన్స్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. చిడో తుఫాన్‌ బీభత్సానికి ఆదివారం 11మంది మరణించగా, 250 మందికి గాయపడ్డారు. సోమవారానికి మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఊహించి స్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మయోట్ ద్వీపంలో చీడో తుపాన్ సృష్టించిన బీభత్సంపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మయోట్ ప్రజలు కొన్ని గంటల పాటు భయానక పరిస్థితులు గడిపారు. తుపాన్ వల్ల కొందరు మరణించగా.. మరి కొందరు సర్వస్వం కోల్పోయారు. ఈ  భయానక పరిస్థితుల నుండి వారు త్వరగా బయటపడాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.