Good Health : షుగర్ టెస్ట్ చేయించుకున్నారా.. టైప్ 1... టైప్ 2 డయాబెటిస్ అంటే ఏంటీ.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

తిన్నా నీరసంగా ఉంటది. తిన్న కాసేపటికే ఆకలవుతది. చిన్న పనికే అలసటొస్తది. ఇంకో పని చేయాలనిపించదు. ఊరికె పడుకోవాలనిపిస్తది. నిద్రలో మూత్రానికి పదే పదే లేవాల్సి వస్తది. ఓ చోట కూర్చోవాలనిపించదు. మాటిమాటికీ దప్పికయితది. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. చక్కెర వ్యాధి తలుపుతట్టేముందు శరీరం చెప్పే హెచ్చరికలివి. జాగ్రత్తపడితే బయటపడ్డట్టే వదిలేసినో డయాబెటిస్ వదిలిపెట్టదు. అది లైఫ్ టైమ్ మనతోనే ఉంటది.

ఇంటికి ఎవరైనా వస్తే టీ ..  ఇవ్వడం మర్యాద. టీ ఇచ్చే ముందు.. చక్కెర వెయ్యాల్నా? వద్దా? అని అడగడం ఇప్పుడు కొత్త మర్యాద. ఎందుకంటే అవతలివాళ్లకు షుగర్ ఉందేమో!  అని కనుక్కోవడం అమర్యాద కాదు. షుగర్ చాలామంది జీవితాల్లోకి వచ్చేసింది. హోటల్​ కు  వెళ్లినా షుగర్ లెస్ అని చెప్పడానికి ఎవ్వరికీ అభ్యంతరం ఉండట్లేదు. పండుగకో, ఏదైనా అకేషన్ కో స్వీట్స్ తీసుకెళ్లడం...  కొన్ని షుగర్ ఫ్రీ స్వీట్స్ కొని పెట్టుకోవడం కూడా మామూలే ... షుగర్ జబ్బంటే ఒకప్పుడు ఎవరికో ఉందని వినేటోళ్లు. ఇప్పుడు వాళ్లు మన మధ్యే పెరిగిపోతున్నరు.

 డయాబెటిస్ ఇంతమందికి ఎట్లొచ్చింది? ఎందుకొస్తంది? పొలం పనులు చేసే రైతులకీ, ఇంటి పనులు చేసే ఆడోళ్లకి, చిన్న పిల్లలకీ ఎందుకొస్తంది? వాళ్లు చేసిన తప్పేంటి? సరిదిద్దు కోవాల్సిందేమిటో.. ఇప్పుడు ఈ విషయం గురించి  అందరూ మాట్లాడాలంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  

Also Read : ఉత్తాన ఏకాదశి ఎప్పుడు.. ఆరోజు ఏంచేయాలి..

షుగర్ వస్తే  తీపి మానేస్తే సరిపోదు .. దినదిన గండం లాంటి జీవితం అది. ఒళ్లు గుల్ల చేసే డయాబెటిస్​ తో ...  ఎన్నో ఇబ్బందు లు వస్తాయి. డబ్బు కూడా గుల్లవుతది. అట్లని అదేమీ భయపడే జబ్బేమీ కాదు. మందులకు లొంగకున్నా మంచి తిండికి... మంచి అలవాట్లకు లొంగిపోయే జబ్బు.  జనంలో అవేర్​ నెస్ వస్తే డయాబెటిస్ ..వచ్చినా ఉండదు. అందుకే అవగాహన పెంచాలని ప్రతి సంవత్సరం  నవంబరు 14న 'వరల్డ్ డయాబెటిస్ డే' నిర్వహిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది  డయాబెటిస్​తో బాధపడుతున్నా... రోజు రోజుకు ఇంకా పెరుగుతున్నారు. ఇక డయాబెటీస్​ లోని రకాల గురించి తెలుసుకుందాం. 

టైప్-1 డయాబెటిస్ 

 ఇది వంశపారంపర్యంగా వస్తది. ఇది పిల్లలకు వస్తది. వీళ్లలో క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ తయారు కాదు. జన్యుపరమైన లోపాలతో రోగ నిరోధక వ్యవస్థ క్లోమ గ్రంథిలోని ఇన్సులిన్ తయారు చేసే కణాలపై దాడి చేస్తది. బ్లడ్​ లో  షుగర్ ఎక్కువగా ఉంటది. షుగర్ బాగా ఎక్కువైతే హైపర్ గ్లైసీమియా వస్తది. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోలేరు. కోమాలోకి పోతారు. ఫిట్స్ వస్తయి. ఇది మందులు వాడినా తగ్గదు. టైప్-2 డయాబెటిస్ వచ్చినవాళ్లు బరువు పెరుగుతరు. కానీ, టైప్- డయాబెటిస్ వచ్చినవాళ్లు బరువు తగ్గుతరు.

టైప్-2 డయాబెటిస్ 

  • ఊబకాయం (ఒబెసిటీ)
  •  శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం.. . మానసిక ఒత్తిడి
  •  జన్యు కారణాలు (ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉండి ఉంటే వాళ్ల తర్వాత తరాల్లో ఏ తరంలోనైనా రావొచ్చు.)
  •  ఇమ్యూనిటీ (రోగ నిరోధక వ్యవస్థ అదుపుతప్పి ఇన్సులిన్ తయారు చేసే కణాలపై దాడి చేస్తే ఇన్సులిన్ లోపం వస్తది.

–వెలుగు,లైఫ్​–