యాదాద్రి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

యాదాద్రి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మూటకొండూర్ మండలం అమ్మనబోలు గ్రామ పరిధిలోని అభీద్ నగర్ లోని చెరువులో  ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు.  

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు ఊరికి వెళ్లారు. అయితే ఊరి పక్కన ఉన్న చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి చనిపోయారు.  ఘటనా స్థలం దగ్గరకు వెళ్లిన స్థానికులు, పోలీసులు ఈతగాళ్లతో చెరువులో గాలించి మృతదేహాలను బయటకు తీశారు.  మృతులు శశి,చరణ్ గా పోలీసులు గుర్తించారు. మృతులు బోడుప్పల్,ఉప్పల్ వాసులుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

ALSO READ | యాదగిరిగుట్టలో బ్రిడ్జిని తొలగించండి : బీజేపీ నాయకులు