ఇండియాలో మెడిసిన్ చదివిన విద్యార్థులకు ఇంగ్లాండ్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ల కొరత ఏర్పడింది. తక్కువ జీతాలు, ఖరీదైన ట్రైనింగ్, అధిక పని భారం కారణంగా ఆ దేశంలో విద్యార్థులు వైద్య వృత్తిని ఎక్కువగా ఎంచుకోవడం లేదు. దీంతో బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఇండియా నుంచి 2వేల మంది మెడిసిన్ చదివిన స్టూడెంట్స్ ను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన నియమించుకోనుంది. వీరికి 6 నుంచి 12 నెలల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడి హాస్పిటల్ లో పోస్టింగ్ ఇస్తారట. ప్రతి ఏటా భారతదేశంలో 1లక్ష 10వేల మంది మెడిసిన్ చదివి పాస్ ఔట్ అవుతున్నారు. కావున భారత్ పై ఏలాంటి ప్రభావం పడదని ప్రొఫెసర్లు చెబుతున్నారు. వీరికి ఇండియాలో నిర్వహించే ప్రొఫెషనల్ అండ్ లింగ్విస్టిక్ అసెస్ మెంట్ బోర్టు టెస్ట్ నుంచి మినహాయిపు ఉంటుందని ఇంగ్లాండ్ అధికారులు చెబుతున్నారు.
Also Read :కొత్తగా పెళ్లైన మహిళలు హోలీ ఎక్కడ ఆడాలో తెలుసా..