రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, పలువురికి గాయాలు

తిమ్మాపూర్, వెలుగు : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును మరో బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం కరీంనగర్‌‌ మానేరు బ్రిడ్జిపై గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌‌ నుంచి జమ్మికుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకని మానేరు బ్రిడ్జిపై ఆపారు. ఈ క్రమంలో కరీంనగర్‌‌ నుంచి కోహెడ వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్యాసింజర్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు.