కరీంనగర్లో వడదెబ్బతో ఇద్దరి మృతి 

కరీంనగర్ జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం (మే31) జిల్లాలోని వీణవంక, చొప్పదండిలో  ఎండ తీవ్రత పెరిగి వడగాల్పులు వీయడంతో వేడిమి తట్టుకోలేక మృతిచెందారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన కళ్యాణం రామక్క అనే వృద్ధురాలు వడదెబ్బ తగలడంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

మరోవైపు చొప్పదండిలో వడదెబ్బతో లారీ డ్రైవర్ మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా కెసోరాం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ లోడ్ తో  చొప్పదండికి వచ్చిన లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్(60) ఎండదెబ్బతో తీవ్ర  అస్వస్థతకు గురై రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోయాడు. గమనించిన స్థానికులు 108కు ఫోన్ చేయగా.. 108 వాహనం వచ్చే లోపే జాకీర్ హుస్సేన్  చనిపోయినట్లు గుర్తించారు.