గోదావరిఖనిలో బతుకుదెరువుకొచ్చి బ‌‌‌‌ల‌‌‌‌య్యారు

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
  •  గోదావరిఖనిలో యాక్సిడెంట్​

గోదావ‌‌‌‌రిఖ‌‌‌‌ని, వెలుగు : బతుకు దెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఉత్తర్‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌కు చెందిన సత్యేందర్‌‌‌‌‌‌‌‌(19), దేవదత్‌‌‌‌నాయక్‌‌‌‌(28) మెహందీ డిజైనర్లు. వీరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌లో పనిచేస్తున్నారు. శనివారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని  ఇంక్లైన్ కాల‌‌‌‌నీలో ఓ పెండ్లికి సంబంధించి మెహందీ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఉండగా వెళ్లారు. 

అర్ధరాత్రి 12.30 గంటలకు పని ముగించుకొని బైక్‌‌‌‌పై తిరిగి వస్తుండగా గంగానగర్‌‌‌‌‌‌‌‌ సమీపంలో గుర్తు తెలియని లారీ వీరి బైక్‌‌‌‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు డెడ్‌‌‌‌బాడీలను గోదావ‌‌‌‌రిఖ‌‌‌‌ని ఏరియా హాస్పిటల్‌‌‌‌లో భద్రపరిచారు. బంధువులు, షాపింగ్‌‌‌‌మాల్ నిర్వాహ‌‌‌‌కుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గోదావరిఖని –1 టౌన్‌‌‌‌ ఎస్‌‌‌‌ఐ శ్రీనివాస్‌‌‌‌ తెలిపారు.