నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. 63వ జాతీయ రహదారిపై గుజరాత్ నుండి వైజాగ్ కు గ్రానైట్లతో వెళుతున్న లారీ.. కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న లారీ ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక లారీ అందరూ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది.మరొక లారీ నుజ్జునుజ్జు అయ్యింది. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దగ్ధమవుతున్న లారీ మంటలను ఆర్పి వేశారు. ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని చేస్తున్నారు