ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ .. మంటల్లో లారీ దగ్ధం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  కోదాడ మండలం ద్వారకుంట పరిధిలో ఆగి ఉన్న లారీనీ వెనకనుంచి మరో లారీ ఢీకొట్టింది.దీంతో  లారీలో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది.  మరో లారీ  లారీ పల్టీ కొట్టింది. డ్రైవర్లు  స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

రెండు లారీలు విజయవాడ వెళుతుండగా  రాత్రిపూట పార్కింగ్ చేస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీ కొనడంతో  ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.