కుప్పకూలిన రెండంస్థుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జాకీర్‌ కాలనీలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద 8 నుంచి 10 మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు ఇద్దరిని రక్షించారు. వీధులు ఇరుకుగా ఉండటంతో పెద్ద పెద్ద యంత్రాలు ఘటన జరిగిన ప్రదేశం వద్దకు వెళ్లలేకపోతున్నాయి. దాంతో, రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోంది. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ (మీరట్ డివిజన్) సెల్వ కుమారి తెలిపారు.

క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించాలి

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరాతీశారు.. క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ALSO READ : బిగ్ బ్రేకింగ్: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం.