ఆర్మూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ కు చెందిన సందీప్(21), ప్రమోద్ (22) మంగళవారం ఆర్మూర్ కు బైక్ పై వెళ్లి పని పూర్తి చేసుకుని జక్రాన్ పల్లి మండలం సికింద్రాబాద్ మీదుగా బయలుదేరి వెళ్తున్నారు.
నేషనల్ హైవే -44పై సికింద్రాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని బైక్ తో ఢీ కొట్టడడంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. డెడ్ బాడీలను పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జక్రాన్ పల్లి ఎస్ఐ తిరుపతి తెలిపారు.