కోదాడ దగ్గర ఢీ కొన్న రెండు బస్సులు.. 25 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా  కోదాడ బైపాస్ కట్టకొమ్మ గూడెం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  విజయవాడ వెళ్తున్న  ప్రైవేట్   బస్సును  ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది.  ఈ ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి  విజయవాడ వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  

 ఈ ఘటనలో రెండు బస్సులు నుజ్జనుజ్జ అయ్యాయి.  స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వీరిలో నలుగురికి సీరియస్ గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.