ముంబై: కోల్‌కతాలో మహిళా డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యంపై డాక్టర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుండగా.. తాజాగా ముంబైలో ఓ లేడీ డాక్టర్‌పై దాడి జరిగింది. లోకమాన్య తిలక్ మునిసిపల్ జనరల్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో విధుల్లో ఉన్న డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేశారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
దాడికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చెవికి గాయంతో ఆసుపత్రికి వచ్చిన రోగి.. చికిత్స చేస్తుండగా డాక్టర్‌ను దుర్భాషలాడడంతో పాటు వెంట వచ్చిన బంధువులతో కలిసి దాడి చేశాడు. దీంతో వైద్యురాలికి గాయాలయ్యాయని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.