పసుపు మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్. చర్మ నిగారింపుకే కాకుండా.. యాంటీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడటంలో పసుపు ముందుంటుంది. అందుకే అన్ని కూరల్లో పసుపు వాడుతుంటారు. అయితే రోజు పసుపుతో తయారు చేసుకున్న టీ తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు. రోజు నార్మల్ టీ తాగే బదులు అప్పుడప్పుడు ఈ పసుపు టీని ట్రై చేయండి. పసుపు టీని ఏలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చుద్దాం..
గిన్నెలో ఓ కప్పు నీళ్లు పోసి అందులో ఓ టేబుల్ స్పూన్ షుగర్ లేదా బెల్లం వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక అందులో చిటికడు శొంఠి పొడి, అల్లం తురుము వేసి మరగనివ్వాలి. తర్వాత ఆ నీటికి దాల్చిన చెక్క, మిరియాల పొడి కూడా కలపాలి. చివరిగా పసుపు వేసి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా తయారు చేసుకున్న పసుపు టీ రోజూ మరగడుపున తాగితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటంటే..
ALSO READ :- బీఆర్ఎస్ మూడు పార్టీలుగా విడిపోతుంది : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
> ఒబెసిటీ నుంచి బయట పడొచ్చు.
> పసుపులో ఉండే కుర్కుమిన్ కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇది స్త్రీల నెలసరి టైంలో మంచి ఉపశమనం.
> పసుపు టీ బాడీలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది.
> క్యాన్సర్ ట్యూమర్ల పెరుగుదలను నిరోధిస్తుంది.
> హార్మొన్లు బ్యాలెన్స్ చేయడానికి, టైప్ 2 డయాబెటిస్ నుంచి బయట పడటానికి ఈ టీ మంచిది.
> రోగనిరోధన శక్తి కూడా పెరుగుతుంది.