గుడ్ న్యూస్: ఫంక్షన్లకు ఇచ్చే ఆర్టీసీ బస్సుల రేట్లు తగ్గింపు

కరీంనగర్, వెలుగు: పెళ్లిళ్లు, దైవదర్శనాలు, టూర్లతో పాటు ఇతర ప్రయాణాలకు ఇచ్చే ఆర్టీసీ బస్‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌ రేట్లను టీజీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ భారీగా తగ్గించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ చేసింది. పల్లె వెలుగు బస్సులకు గతంలో కిలోమీటర్ కు రూ.68 చొప్పున ఉండగా దానిని రూ.52కు తగ్గించింది.

ఎక్స్ ప్రెస్ బస్సులకు కిలోమీటర్ కు రూ.69 నుంచి రూ.62, డీలక్స్ బస్సులకు కిలో మీటర్​కు రూ.65 నుంచి రూ.57, సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటర్ కు రూ.65 నుంచి రూ.59కి తగ్గించింది.