కాంగ్రెస్ లోకి బాజిరెడ్డి?

  • నిజామాబాద్ బరిలోకి దిగే చాన్స్!

  • ఒకటి రెండు రోజుల్లో హస్తం గూటికి

  • ఇందూరులో మారిన ఈక్వేషన్స్?


హైదరాబాద్: నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయనను బరిలోకి దించేందుకు కాంగ్రెస్  ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగనున్న విషయం తెలిసందే. ఈ మేరకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో అదే మున్నూరు కాపు  సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత బీఆర్ఎస్ బాజిరెడ్డిని బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది. ఈ తరుణంలో ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుందనే సమాచారం అందుతోంది.

కాంగ్రెస్ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ చేరితే పరిస్థితి  ఎలా ఉంటుంది..? కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది హాట్ టాపిక్ గా మారింది.